logo

రహదారి కబ్జా... సాగుతో దర్జా

మండలంలోని కలిచెర్ల గ్రామానికి చెందిన పాపిరెడ్డిచెరువు ఆయకట్టు భూములకు వెళ్లే దారిని ఆక్రమించుకుని చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు.

Updated : 01 Jul 2024 05:54 IST

కలిచెర్లలో రహదారిని ఆక్రమించి నాటిన మొక్కలు

పెద్దమండ్యం, న్యూస్‌టుడే: మండలంలోని కలిచెర్ల గ్రామానికి చెందిన పాపిరెడ్డిచెరువు ఆయకట్టు భూములకు వెళ్లే దారిని ఆక్రమించుకుని చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు. పొలాలకు దారి లేకుండా చేసినా పట్టించుకునే వారే కరవయ్యారని వాపోతున్నారు. కలిచెర్ల గ్రామం సర్వే నంబరు 786లో రెండు ఎకరాలు ఆక్రమించి పొలాలకు వెళ్లేదారి లేకుండా చేసి మొక్కలు నాటాడని, వైకాపా నాయకుల అండదండలతో దారిని, రైతులు పండించిన పంటలను ఆరబెట్టుకునే వడ్లబండను కూడా ఆక్రమించుకున్నాడని వాపోతున్నారు. స్థానిక తహసీల్దారుకు ఆరుసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. స్పందనలో ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు కరవయ్యారని వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని