logo

ఇంటి వద్దకే నడిపింఛను

ఎన్నికల ముందు పింఛనుదారులకు నరకం చూపించడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛను ఇంటి వద్దకు రాదని వైకాపా నాయకులు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేశారు... పలువురు వృద్ధుల మరణాలకు కారకులయ్యారు.

Published : 01 Jul 2024 03:33 IST

ఎన్నికల ముందు పింఛనుదారులకు నరకం చూపించడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛను ఇంటి వద్దకు రాదని వైకాపా నాయకులు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేశారు... పలువురు వృద్ధుల మరణాలకు కారకులయ్యారు. వారి ఎత్తులు చిత్తుకాగా ఆ పాపమే వైకాపాకు శాపమై అధికారానికి దూరమైంది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నేడు (సోమవారం) ఇంటి వద్దనే కూటమి ప్రభుత్వ హయాంలో పెంచిన పింఛను సొమ్ము పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా సీఎం చంద్రబాబు పంపిన సందేశ పత్రాన్ని కూడా లబ్ధిదారులకు అందజేయనున్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొని పింఛను పంపిణీని పండుగలా నిర్వహించనున్నారు.

న్యూస్‌టుడే, కడప

ఉదయం 6 గంటలకే మొదలు : జిల్లాలో 2,66,385 మందికి ఏప్రిల్‌ నుంచి ఉన్న బకాయిలతో కలిపి మొత్తం రూ.178.38 కోట్లు పంపిణీ చేయనున్నారు. సచివాలయాల్లో 6,877 మందికిగాను 5,575 మంది పనిచేస్తున్నారు. సిబ్బంది కొరత ఉన్న చోట్ల ఇతర శాఖల్లో పనిచేస్తున్న సహకారం తీసుకోవాలని ఉన్నత స్థాయి నుంచి ఉత్తర్వులందాయి.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంపిన సందేశ పత్రం, పింఛను సొమ్ము అందినట్లు పంపిణీ చేసిన ఉద్యోగి, అధికారి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రాన్ని లబ్ధిదారులకు అందజేయనున్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే పింఛను పంపిణీ మొదలవనుంది. పార్టీ నాయకులను కూడా ఈ పంపిణీ క్రతువులో భాగస్వాములు కావాలని తెదేపా అధిష్ఠానం నుంచి ఉత్తర్వులందాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు