logo

మూడేళ్లుగా నిర్లక్ష్యం...లీకేజీలతో సతమతం

అట్లూరు మండలంలోని రెడ్డిపల్లె ఎస్సీ కాలనీలోని ఉపరితల జలాశయం మూడేళ్లగా నిర్లక్ష్యానికి గురైంది.

Published : 01 Jul 2024 03:06 IST

పగిలిపోయిన నీటి గొట్టాలు
అధ్వానంగా మారిన ఉపరితల జలాశయం

న్యూస్‌టుడే, అట్లూరు: అట్లూరు మండలంలోని రెడ్డిపల్లె ఎస్సీ కాలనీలోని ఉపరితల జలాశయం మూడేళ్లగా నిర్లక్ష్యానికి గురైంది. లీకేజీలతో కాలనీకి నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలో రైతు పొలాలకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇటీవల గ్రామంలో తిరునాల జరగగా మంచినీటి పథకం నీరు అందక పొలాల మోటారు నుంచి నీరు మోసుకున్నారు. ఉపరితల జలాశయానికి శుభ్ర పరిచే గొట్టం, జలాశయం నిండాక అదనంగా వచ్చే నీటిని బయటకు పంపించే మరో గొట్టం రెండు గొట్టపు పైపులు పగిలి పోయాయి. తాగునీటి మోటారు నుంచి ఉపరితల జలాశయానికి వెళ్లే గొట్టం పలుచోట్లు రంధ్రాలు పడి నీరంతా వృథాగా పోతుంది. గ్రామంలో అందరికీ నీరందడం లేదు. ఉపరితల జలాశయం వద్దకు వెళ్లాలన్నా చుట్టూ కంప చెట్లు అల్లుకుపోయి ఉన్నాయి. ఐదేళ్లు వైకాపా ప్రభుత్వంలో అధికారులు ఈ జలాశయానికి బాగుచేసిన సంఘటనలు లేవు.

కంపల మధ్య దారి రాకపోకలకు అవస్థలు

రెడ్డిపల్లె ఎస్సీ కాలనీలోని ఉపరితల జలాశయం దగ్గరకు వెళ్లే దారే కంపల్లో ఉంది. ట్యాంకును శుభ్రం చేసిన దాఖలాల్లేవు. వర్షాకాలం రాబోతుంది. తాగునీటి ట్యాంకును వెంటనే బాగుచేసే చర్యలు అధికారులు చేపట్టాలి. లీకేజీలతో గ్రామానికి నీరందడం లేదు. డైకెర్ట్‌ పంపింగ్‌ ద్వారా నీటి సరఫరా చేయాలనుకుంటే గ్రామంలో పైప్‌ లైన్‌ సక్రమంగా లేదు. కొన్ని వీధులకు నీరెల్లదు. ఉపరితల జలాశయం నుంచే గ్రామానికి నీరు చేరాలి.

సుబ్బయ్య, రెడ్డిపల్లె 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని