logo

బాగున్న బస్సులన్నీ పుంగనూరుకు వెళ్లాయి

ఆర్టీసీ డిపోల్లో బాగున్న బస్సులన్నీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలంతో పుంగనూరుకు తరలించారని, వాటిని తిరిగి రప్పించాలని బహుజన ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ మదనపల్లె 1, 2 డిపోల నాయకులు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Published : 29 Jun 2024 03:12 IST

మళ్లీ డిపోలకు పంపాలని మంత్రికి వినతి

మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డితో మాట్లాడుతున్న ఆర్టీసీ బహుజన ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు అర్జున్‌నాయక్, శివ, నరసింహులు

మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే : ఆర్టీసీ డిపోల్లో బాగున్న బస్సులన్నీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలంతో పుంగనూరుకు తరలించారని, వాటిని తిరిగి రప్పించాలని బహుజన ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ మదనపల్లె 1, 2 డిపోల నాయకులు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాయచోటిలో శుక్రవారం నాయకులు అర్జున్‌నాయక్, నరసింహులు, శివ, రమణ తదితరులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కారణాలతో మదనపల్లె నుంచి పుంగనూరు డిపోకు 20 బస్సులు తరలించుకుపోయారని తెలిపారు. ఈ క్రమంలో బస్సులు పుంగనూరు నుంచి నడపటం వల్ల ఉదయం, సాయంత్రం వేళల్లో 50 కిలోమీటర్ల మేర ఖాళీగా తిరుగుతూ, ఆర్టీసీకి నష్టాన్ని కలుగజేస్తున్నాయని వివరించారు. కడప, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, చిత్తూరు, కదిరి ప్రాంతాల మధ్య తిరిగే బస్సులను తిరిగి మదనపల్లె డిపోలకే పంపించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి  పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

కడప క్రీడలు : ఉమ్మడి కడప జిల్లాలో వ్యాయామోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని రవాణా, యువజన, క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి సంఘం ప్రతినిధులు కోరారు. రాయచోటిలో శుక్రవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూజీపీఈడీ డిగ్రీ అర్హత ఉన్న ఉపాధ్యాయులను ఒక ఏడాది బ్రిడ్జి కోర్సు ఏర్పాటు చేసి పాఠశాల సహాయకులుగా పదోన్నతి కల్పించాలన్నారు. రైల్వే, ఆర్టీసీ బస్సులో క్రీడాకారులకు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ కల్పించాలని, జీవో 117ను రద్దు చేసి ఉన్నత పాఠశాలల్లో పీఈటీ పోస్టులను పునరుద్ధరించాలని వారంతా విన్నవించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని