logo

ఉద్యోగులపై తప్పుడు కేసులు ఎత్తేయాలని డిమాండు

ఆర్థిక బకాయిల కోసం ఉద్యోగులు ఉద్యమిస్తే గత ప్రభుత్వ పాలకులు తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారని, తక్షణమే వాటిని ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది.

Published : 29 Jun 2024 03:06 IST

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఆర్థిక బకాయిల కోసం ఉద్యోగులు ఉద్యమిస్తే గత ప్రభుత్వ పాలకులు తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారని, తక్షణమే వాటిని ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి రఘురామనాయుడు, జిల్లా అద్యక్ష, కార్యదర్శులు రమేష్‌కుమార్, సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలోని ఉద్యోగులు శుక్రవారం నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ విజయరామరాజుకు వినతిపత్రం అందించారు. నాయకులు మాట్లాడుతూ ఐఏఎస్‌ అధికారుల నుంచి ఆఫీసు సబార్డినేట్‌ వరకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేశామన్నారు. తమ నాయకుడు, ఐక్యవేదిక అధ్యక్షుడు సూర్యనారాయణపై తప్పుడు కేసులతో వేధించి మానసిక వేదనకు గురిచేశారని చెప్పారు. ఆ కేసులన్నీ తొలగించి, వేధించిన అధికారులను తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. సంఘం నేతలు చంద్రశేఖర్, కృష్ణ ప్రసాద్, ప్రభాకర్‌రావు, ఓబులేసు, రాజశేఖర్, మురళీకృష్ణ, వివిధ ప్రాంతాల ఉద్యోగులు, పింఛనుదారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని