logo

ఆక్రమణలు తొలగించకుంటే కూల్చేస్తాం: ఎమ్మెల్యే

మురుగుకాల్వలు, రహదారులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చేస్తామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి హెచ్చరించారు.

Published : 29 Jun 2024 03:05 IST

34వ డివిజన్లో ఆక్రమణలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి

కడప నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: మురుగుకాల్వలు, రహదారులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చేస్తామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి హెచ్చరించారు. ఆమె శుక్రవారం నగరంలోని 34వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వైకాపా కార్పొరేటర్‌ అక్బర్‌ కాల్వను ఆక్రమించి పార్టీ డివిజన్‌ కార్యాలయాన్ని కట్టినట్టు గుర్తించారు. నేరుగా కార్యాలయంలోకి వెళ్లిన ఆమె... కాల్వపై ఎలా కట్టారని అక్కడ ఉన్న కార్పొరేటర్‌ అనుచరులను ప్రశ్నించారు. వారం రోజుల్లో స్వయంగా ఈ ఆక్రమణలను తొలగించకపోతే జేసీబీతో కూల్చివేస్తామని స్పష్టం చేశారు. ఆ పక్కనే కాల్వను ఆక్రమించి ఎంపీ నిధులతో కార్పొరేటర్‌ కట్టిన వాటర్‌ప్లాంటును పరిశీలించారు.  జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డి ఇలాంటి వారికి నిధులు ఇచ్చి ఆక్రమణలను ప్రోత్సహించారని విమర్శించారు.

కాల్వల్లో వ్యర్థాలు వేయకండి

34వ డివిజన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని మురుగుకాల్వలను పరిశీలించిన ఎమ్మెల్యే చెత్తా చెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, టాయిలెట్‌ విసర్జితాలను కాల్వల్లో వేయొద్దని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. వ్యర్థాలతో పారుదల నిలిచిపోతోందని చెప్పారు. దోమల ఉద్ధృతికి అడ్డుకట్ట వేయడానికి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలు సహకరించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని