logo

అటవీ అధికారులను అడ్డుకున్న ఆక్రమణదారులు

ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె పంచాయతీ అటవీ ప్రాంత భూముల ఆక్రమణదారులందరికీ శుక్రవారం తాఖీదులు ఇచ్చేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను అడ్డుకున్నారు.

Published : 29 Jun 2024 03:02 IST

ఎఫ్‌బీవో రాజేష్‌తో వాగ్వాదానికి దిగిన పెన్నానగర్‌ వాసులు

ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె పంచాయతీ అటవీ ప్రాంత భూముల ఆక్రమణదారులందరికీ శుక్రవారం తాఖీదులు ఇచ్చేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను అడ్డుకున్నారు. గుడిసెలు వేసే సమయంలో అడ్డుకోకుండా 30 ఏళ్ల తర్వాత వచ్చి ఖాళీ చేయాలంటే, తాము ఎక్కడికి వెళ్లి బతకాలని వారంతా అధికారులను నిలదీశారు. తమ విధులను అడ్డుకోవద్దని ఇది లోకాయుక్త కోర్టు ఆదేశాలని అందరూ సహకరించాలని అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం జేశారు. వాగ్వాదానికి దిగిన వారంతా పోలీసుల జోక్యంతో సద్దుమణిగారు. ఈ విషయమై ఎఫ్‌ఆర్వో హేమాంజలి మాట్లాడుతూ రామేశ్వరం రిజర్వు అటవీ ప్రాంతం భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయని, వాటిని సంరక్షించాలని  లోకాయుక్త కోర్టు ఆదేశించింది. తమ పరిశీలనలో సర్వే సంఖ్య 542/1లో 16.23 ఎకరాల భూములను 219 మంది ఆక్రమించి ఇళ్లు, పరిశ్రమల వంటి కట్టడాలు నిర్మించినట్లు గుర్తించాం. వారికి తాఖీదులిచ్చి నిర్ణీత గడువులోపు ఖాళీ చేయించి అటవీ భూములను స్వాధీనం చేసుకునేలా 172 మందికి తాఖీదులిచ్చామని, 15 రోజుల్లో ఖాళీ చేయకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని