logo

నేత్రపర్వంగా ఊయల సేవ

భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయంలో జ్యేష్ఠ మాసం జాతర ముగింపు పూజలను గురువారం వేదోక్తంగా నిర్వహించారు.

Published : 05 Jul 2024 05:00 IST

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయంలో జ్యేష్ఠ మాసం జాతర ముగింపు పూజలను గురువారం వేదోక్తంగా నిర్వహించారు. ఉదయం ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ ఆధ్వర్యాన అమ్మవారి తొమ్మిది గరగలను సుందరంగా అలంకరించారు. గరగలకు పుట్టింటి వారైన మెంటేవారి, మెట్టినింటి వారైన అల్లూరివారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు చేయించి ఊయల సేవ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం సహాయ కమిషనర్‌ బి.ఎం.నగేశ్, ఆలయ పర్యవేక్షకులు పి.వాసు, ఎ.బాబురావు, తనిఖీదారులు ఎన్‌.లోకనాథం, అసాధులు, ట్రస్టు మాజీ ధర్మకర్త కొప్పర్తి నరసింహమూర్తి దంపతులు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని