logo

సొంత సొమ్ముతో రోడ్డు నిర్మాణం

కుప్పనపూడి పరిధి తాళ్లకోడు ప్రాంతంలోని 74 ఎకరాల జగనన్న లేఅవుట్‌లో తాగునీరు, రహదారులు, మురుగు కాలువలు తదితర వసతుల్లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 05 Jul 2024 04:48 IST

74 ఎకరాల జగనన్న  లేఅవుట్‌లో జనం పాట్లు

రోడ్డును బాగు చేసుకుంటున్న నివాసితులు

ఆకివీడు, న్యూస్‌టుడే: కుప్పనపూడి పరిధి తాళ్లకోడు ప్రాంతంలోని 74 ఎకరాల జగనన్న లేఅవుట్‌లో తాగునీరు, రహదారులు, మురుగు కాలువలు తదితర వసతుల్లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతర్గత రహదారులన్నీ మట్టి రోడ్లుగా దర్శనమిస్తుండటంతో లబ్ధిదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికీ  బురదమయంగా మారుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు.   వైకాపా సర్కారు అసమర్థ పాలనకు ఈ లేఅవుట్‌ నిదర్శనంగా మారుతోంది. గత పాలకుల తీరుతో విసిగి వేసారిపోయిన స్థానికులు సొంత నిధులతో సుమారు రెండు కిలోమీటర్ల పొడవున్న రహదారి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. గురువారం కంకర, వ్యర్థ ఇటుకలు తెప్పించుకొని... జేసీబీ సాయంతో శ్రమదానం చేసి రహదారి ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మొత్తం 50 మంది నివాసితులుండగా... ఒక్కొక్కరు రూ.2 వేలు నుంచి రూ.3 వేలు మేర నగదు వెచ్చించినట్లు స్థానికులు షేక్‌ బాజీ, జి.నానాజీ, ఎం.సూర్యనారాయణరాజు, ప్రకాశ్, చంద్రశేఖర్, శ్రీను, రమణ తదితరులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని