logo

నిలిచిన బిల్లులు..ఆగిన నిర్మాణం!

అత్తిలిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు బాలారిష్టాలు తప్పడంలేదు.  అత్తిలి మండలం చుట్టుపక్కల 35 గ్రామాల ఇంటర్‌ విద్యార్థులకు అత్తిలి శ్రీవల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలే ఆధారం.

Published : 04 Jul 2024 05:04 IST

పునాది దశలోనే అత్తిలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 
గత వైకాపా పాలకుల నిర్లక్ష్యంతో తప్పని వెతలు

భవన నిర్మాణం ఇలా..

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: అత్తిలిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు బాలారిష్టాలు తప్పడంలేదు.  అత్తిలి మండలం చుట్టుపక్కల 35 గ్రామాల ఇంటర్‌ విద్యార్థులకు అత్తిలి శ్రీవల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలే ఆధారం. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించి ఉన్నత విద్యావంతులుగా, అధికారులుగా, నాయకులుగా సేవలందిస్తున్నారు. అటువంటి కళాశాలకు నూతన భవన నిర్మాణ పనులను 2019లో అప్పటి తెదేపా ప్రభుత్వం రూ.2.8 కోట్లను కేటాయించి,  శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం గుత్తేదారుడికి చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి. అయిదున్నరేళ్లుగా కళాశాల నిర్మాణానికి విద్యార్థులు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.  

ప్రస్తుతం కళాశాలను ప్రభుత్వ బాలుర పాఠశాలలో నిర్వహిస్తున్నారు. గతంలో 250 నుంచి 300 మంది వరకు జూనియర్‌ కళాశాలలో విద్యార్థులు చదువుకునేవారు. ప్రస్తుతం ఎలాంటి మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య 68కి పడిపోయింది. పాఠశాల, కళాశాల విద్యార్థ్థుల తరగతులను ఎదురెదురుగా నిర్వహిస్తుండటంతో అయోమయం పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. 

వచ్చారు.. చూశారు.. వెళ్లారు..

 2022 నవంబరులో కళాశాలను అప్పటి విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ సందర్శించి విద్యాశాఖాధికారులతో మాట్లాడి త్వరితగతిన కళాశాల భవనం నిర్మాణం జరిగేలా ఆదేశాలు ఇచ్చారు. అయినా నిధులు విడుదల కాకపోవడంతో పునాది దశలోనే కళాశాల ఆగిపోయింది. రీ గత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌ కళాశాలను సందర్శించి 2023 మార్చి నాటికి కళాశాల భవనం పూర్తి చేయాలని సూచించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.ః‘‘కళాశాలను త్వరితగతిన పూర్తిచేయడానికి నిధులు మంజూరు చేయాలని ప్రతిపాద]నలు పంపించాం.’’ అని ప్రిన్సిపల్‌ కృష్ణసాయి అన్నారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని