logo

వైకాపాకు అనుకూలంగా రెవెన్యూ సిబ్బంది ఎలా పనిచేశారు?

ఆగిరిపల్లి మార్కెట్‌ యార్డు సమీపంలో ఆర్‌అండ్‌బీ రహదారిని ఆనుకుని ఉన్న పోరంబోకు భూమిలో ఏర్పాటు చేసుకున్న నివాసాలకు గత ప్రభుత్వంలో వైకాపాకు అనుకూలమైన వారికి మాత్రమే అప్పటి తహసీల్దారు ఎం.ఉదయ భాస్కరరావు పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేశారు

Published : 04 Jul 2024 04:48 IST

  పార్థసారథిని కలిసిన బాధితులు
ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆగిరిపల్లి మార్కెట్‌ యార్డు సమీపంలో ఆర్‌అండ్‌బీ రహదారిని ఆనుకుని ఉన్న పోరంబోకు భూమిలో ఏర్పాటు చేసుకున్న నివాసాలకు గత ప్రభుత్వంలో వైకాపాకు అనుకూలమైన వారికి మాత్రమే అప్పటి తహసీల్దారు ఎం.ఉదయ భాస్కరరావు పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న అర్హులైన పేదలకు మాత్రం పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు. ఈ మేరకు నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు ఆరేపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాధితులు బుధవారం రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి సమస్యను వివరించారు. స్పందించిన మంత్రి అక్కడ కొందరికే ఎలా పట్టాలు ఇచ్చారని, వైకాపాకు అనుకూలంగా రెవెన్యూ సిబ్బంది ఎలా పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అక్కడ ఏం జరిగిందో సమగ్ర నివేదిక ఇవ్వాలని తహసీల్దారు బి.మృత్యుంజయరావును ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నివేశన స్థలాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆందోళన చెందవద్దని బాధితులకు మంత్రి భరోసా ఇచ్చారు. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని