logo

రెండేళ్ల తర్వాత బాలుడి ఆచూకీ లభ్యం

ఇంటి నుంచి వెళ్లిపోయిన ఒక బాలుడు రెండేళ్ల తరువాత కోల్‌కతాలో ఉన్నట్లు ఆచూకీ తెలిసింది. ఐసీడీఎస్, జిల్లా బాలల సంరక్షణ అధికారుల కథనం ప్రకారం.. బుట్టాయగూడెం మండలం మర్లగూడేనికి చెందిన కొవ్వాసి మహాలక్ష్మి తన కుమారుడు నందకిశోర్‌ను రెండేళ్ల కిందట బర్రింకలపాడు పాఠశాలలో 5వ తరగతిలో చేర్చారు.

Published : 03 Jul 2024 03:18 IST

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: ఇంటి నుంచి వెళ్లిపోయిన ఒక బాలుడు రెండేళ్ల తరువాత కోల్‌కతాలో ఉన్నట్లు ఆచూకీ తెలిసింది. ఐసీడీఎస్, జిల్లా బాలల సంరక్షణ అధికారుల కథనం ప్రకారం.. బుట్టాయగూడెం మండలం మర్లగూడేనికి చెందిన కొవ్వాసి మహాలక్ష్మి తన కుమారుడు నందకిశోర్‌ను రెండేళ్ల కిందట బర్రింకలపాడు పాఠశాలలో 5వ తరగతిలో చేర్చారు. చదువుకోవడం ఇష్టం లేక కొద్ది రోజులకు ఆ బాలుడు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. గతంలో కూడా ఇదే మాదిరిగా పలుమార్లు ఇంటిలో నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చేవాడు. వస్తాడని ఆ తల్లి ఎదురు చూసినా ఈ సారి తిరిగి రాలేదు. ఎట్టకేలకు నాలుగు రోజుల కిందట కోల్‌కతాలోని హౌరా పోలీసులు ఆ బాలుడు తమ దగ్గర ఉన్నాడని జిల్లా బాలల సంరక్షణ కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఆ మేరకు జిల్లా బాలల సంరక్షణ అధికారిణి సూర్యచక్రవేణి చొరవతో అధికారులు ఆ గ్రామంలో మంగళవారం విచారణ చేశారు. తల్లి మహాలక్ష్మిని, బాలుడితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడించారు. ఆమె తన కుమారుడేనని నిర్ధారించారు. దీంతో అక్కడి నుంచి రప్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సూర్యచక్రవేణి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని