logo

చరిత్రాత్మక నిర్ణయం: మంత్రి నిమ్మల

ఖజానాలో చిల్లిగవ్వ లేకపోయినా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పెంచిన పింఛన్లను జులై 1వ తేదీ నుంచే పంపిణీ చేయడం చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Published : 01 Jul 2024 03:56 IST

పాలకొల్లు, న్యూస్‌టుడే: ఖజానాలో చిల్లిగవ్వ లేకపోయినా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పెంచిన పింఛన్లను జులై 1వ తేదీ నుంచే పంపిణీ చేయడం చరిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మండల పరిషత్తు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన అధికారుల సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పింఛన్ల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిచోట్లా పండగ వాతావరణంలో కార్యక్రమం జరగాలని ఆదేశించారు. వైకాపా పాలనలో జగన్‌ రూ.12 లక్షల కోట్లు అప్పులు చేసి ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయారని, ఇంతటి దారుణ పరిస్థితుల్లోనూ చంద్రబాబు మానవతావాదిగా ఆలోచించి అన్ని వర్గాలను ఆదుకోవాలని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకుంటున్నారన్నారు. వైకాపా ప్రభుత్వం దివ్యాంగులనూ ఇతరులతో సమానంగా ఉంచుతూ పింఛన్‌ పైసా పెంచలేదని,  తమ ప్రభుత్వం రెట్టింపు చేసిందని గుర్తుచేశారు. మొదటి రోజునే వంద శాతం పింఛన్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. పురపాలక సంఘం కమిషనర్‌ విజయసారథి, ఎంపీడీవోలు అనుపమ, సుహాసిని, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని