logo

సీఎస్‌ఈపైనే మక్కువ!

ఏపీఈఏపీ సెట్‌-2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కోర్సులు, కళాశాలల ఎంపికపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వీయ అంచనాల్లో తలమునకలయ్యారు. గతేడాది ఏ కళాశాలలో ఏ కేటగిరికి ఎన్ని ర్యాంకుల వరకు సీటు వచ్చిందో పరిశీలించుకుంటున్నారు.

Published : 01 Jul 2024 03:37 IST

నేటి నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌

ఆగిరిపల్లి, ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: ఏపీఈఏపీ సెట్‌-2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కోర్సులు, కళాశాలల ఎంపికపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వీయ అంచనాల్లో తలమునకలయ్యారు. గతేడాది ఏ కళాశాలలో ఏ కేటగిరికి ఎన్ని ర్యాంకుల వరకు సీటు వచ్చిందో పరిశీలించుకుంటున్నారు. కళాశాలల్లో వసతులు, విద్యా ప్రమాణాలు, ఉద్యోగావకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. విద్యార్థుల్లో అధిక శాతం సీఎస్‌ఈ బ్రాంచిపైనే మక్కువ చూపుతున్నారు. ఏపీఈఏపీ సెట్‌ రాసి అర్హత మార్కులు పొందిన విద్యార్థులు నిర్ణీత షెడ్యూలు ప్రకారం కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు. విద్యార్థులకు లభించిన మార్కులు, ర్యాంకుల ఆధారంగా ఆయా కళాశాలల్లో సీట్లు  కేటాయిస్తారు.
కొత్త కోర్సులు.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పలు కళాశాలలు సీట్లు పెంచుకోవడంతో పాటు కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, డేటా సైన్స్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, రోబోటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్, త్రీడీ ప్రింటింగ్‌ అండ్‌ డిజైన్, వర్చువల్‌ రియాలిటీ వంటి స్పెషలైజేషన్‌ కోర్సులు గతంలో పీజీ స్థాయిలో ఉండేవి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్‌ స్థాయికి మార్పు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని