logo

పకడ్బందీగా కొత్త చట్టాల అమలు: ఏఎస్పీ

దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త చట్టాలను జిల్లాలోనూ పకడ్బందీగా అమలు చేయాలని అదనపు ఎస్పీ స్వరూపరాణి ఆదేశించారు. స్థానిక ఎస్పీ కార్యాలయం నుంచి ఆదివారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆమె మాట్లాడారు.

Published : 01 Jul 2024 03:32 IST

స్వరూపరాణి

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త చట్టాలను జిల్లాలోనూ పకడ్బందీగా అమలు చేయాలని అదనపు ఎస్పీ స్వరూపరాణి ఆదేశించారు. స్థానిక ఎస్పీ కార్యాలయం నుంచి ఆదివారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆమె మాట్లాడారు. నూతన చట్టాలపై పోలీసు అధికారులకు అవగాహన అవసరమన్నారు. ఏవైనా సలహాలు కావాలంటే ప్రతి సబ్‌ డివిజన్‌లోనూ న్యాయ సహాయకులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేసుల నమోదు సమయాల్లో న్యాయ సలహాలు తీసుకోవాలన్నారు. నూతన చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌లను పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు. ఈ మూడు చట్టాలపై ఆన్‌లైన్‌లో ఇప్పటికే అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారన్నారు. అవసరమైతే సంకలన్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, అందులో అన్ని సెక్షన్ల వివరాలు ఉంటాయని ఆమె సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని