logo

సౌరఫలకాలే చరవాణి ఛార్జింగ్‌ సాధనాలు!

నేడు ఫోన్‌ నిత్యావసర వస్తువుగా మారింది. అది లేనిదే గంట గడవటం కష్టంగా మారిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అందరూ ఎల్లవేళలా ఫోన్‌ అందుబాటులో ఉంచుకుంటున్నారు. ఎప్పుడు ఏ అవసరం పడుతుందోనని ఛార్జింగ్‌ తగ్గకుండా జాగ్రత్త పడుతుంటారు.

Published : 29 Jun 2024 04:05 IST

కురుముతోగుల వాసులకు అదే సౌకర్యం

ఇంటిపై ఏర్పాటు చేసిన సౌర ఫలక

కుక్కునూరు, న్యూస్‌టుడే: నేడు ఫోన్‌ నిత్యావసర వస్తువుగా మారింది. అది లేనిదే గంట గడవటం కష్టంగా మారిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అందరూ ఎల్లవేళలా ఫోన్‌ అందుబాటులో ఉంచుకుంటున్నారు. ఎప్పుడు ఏ అవసరం పడుతుందోనని ఛార్జింగ్‌ తగ్గకుండా జాగ్రత్త పడుతుంటారు. అయితే గ్రామానికి విద్యుత్తు సౌకర్యం లేని పరిస్థితుల్లో ఓ ఉపాయం ఆలోచించారు.. కుక్కునూరు మండలం కురుములతోగు వాసులు. పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంతో ఆ పల్లెకు నేటికీ విద్యుత్తు సౌకర్యం కల్పించలేకపోతున్నారు. బయట ప్రపంచానికి దూరంగా ఉండే అక్కడి ప్రజలకు చరవాణి ఒక్కటే సమాచార సాధనం. అందుకే దాన్ని అపురూపంగా చూసుకుంటుంటారు. ఛార్జింగ్‌ కోసం ఖర్చు అధికమైనా వెరవకుండా సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల అతిసారం సోకి ఆ గ్రామంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో 13 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ ఆపద కాలంలో చరవాణి ఒక్కటే తమ ప్రాణాలను కాపాడిందంటున్నారు. ఫోన్‌ సౌకర్యం ఉండబట్టి, సమీపంలోని దామరచర్ల గ్రామ రైతులకు విషయం తెలియజేయడంతో వారు ఆసుపత్రులకు ఫోన్‌ చేసి వైద్యులను రప్పించారని వివరించారు. అప్పటికే ఇద్దరి ప్రాణాలు పోయాయి. అదే ఫోన్‌ లేకుంటే నడిచివెళ్లి సమాచారం తెలిపేసరికి మరికొన్ని ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని గ్రామస్థులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని