logo

వైకాపావి అనాలోచిత నిర్ణయాలు

వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు పట్టణ ప్రజలకు పెద్ద శాపంగా మారాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పురపాలక అధికారులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Published : 29 Jun 2024 03:53 IST

పురపాలక అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే

అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న రామాంజనేయులు 

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు పట్టణ ప్రజలకు పెద్ద శాపంగా మారాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పురపాలక అధికారులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు కోసం సేకరించిన 60 ఎకరాలను అప్పటి ప్రభుత్వం జగనన్న లేఅవుట్‌కు కేటాయిస్తే పురపాలక అధికారులు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. అక్కడ నిర్మించే ఇళ్ల నుంచి వచ్చే మురుగుతో అక్కడి తాగునీటి చెరువులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తాను వ్యతిరేకం కాదని, కానీ తాగునీటి చెరువు కోసం కేటాయించిన భూమి కేటాయించడం సరికాదన్నారు.

  • డ్వాక్రా సంఘాలు రాజకీయాలతో ప్రమేయం లేకుండా అభివృద్ధిపైనే దృష్టిసారించాలని ఎమ్మెల్యే సూచించారు. గతంలో ముగ్గురు ఆర్పీలు నకిలీ గ్రూపులు సృష్టించి ఒక బ్యాంకు నుంచి రూ.30 లక్షలు కాజేశారని.. వారిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. వారు కట్టాల్సిన రూ.22 లక్షలు వసూలు చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు.
  • పురపాలక వాణిజ్య సముదాయాలకు సంబంధించి రూ.25 లక్షలు అద్దె చెల్లించాల్సిన ఓ పెద్దాయనపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారంటూ మున్సిపల్‌ రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రశ్నించారు. తక్షణం ఆ సొమ్ము రికవరీ చేయాలని ఆదేశించారు. ఇక నుంచి పురపాలక సంఘంలో ఎలాంటి వేలం నిర్వహించినా చెక్కులు తీసుకోకుండా బ్యాంకు గ్యారంటీ విధానం అమలు చేయాలని సూచించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని