logo

ఖరీఫ్‌ సాగు లక్ష్యం 86,831 హెక్టార్లు : జేసీ

ఖరీఫ్‌ వరి నాట్లు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్‌ ప్రవీణ్‌ఆదిత్య ఆదేశించారు. సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 29 Jun 2024 03:52 IST

మాట్లాడుతున్న ప్రవీణ్‌ఆదిత్య

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఖరీఫ్‌ వరి నాట్లు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్‌ ప్రవీణ్‌ఆదిత్య ఆదేశించారు. సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలు నవంబరు, డిసెంబరు నెలల్లో తుపాన్ల బారిన పడకుండా సాగు త్వరగా ప్రారంభించి పూర్తి చేసేలా రైతులను సన్నద్ధం చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ వరి సాగు లక్ష్యాన్ని 86,831 హెక్టార్లుగా నిర్ణయించామన్నారు. 2024- 25 సంవత్సరానికి 16 వేల మట్టి నమూనాలు సేకరించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పథకాలు పొందాలంటే సాగుదారులంతా తప్పనిసరిగా ఈ-పంటలో వివరాలు నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 85 క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై అందించామన్నారు. 46,144 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సాగునీటి ఇబ్బందులు లేకుండా కాలువల ప్రక్షాళన పనులు త్వరగా చేయాలని జలవనరుల శాఖాధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావు, డ్రెయిన్ల శాఖ ఈఈ కిశోర్, జలవనరుల శాఖాధికారి దక్షిణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ.. భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీని జులై ఒకటో తేదీ ఉదయం 6 గంటల నుంచే కచ్చితంగా ప్రారంభించాలని సంయుక్త కలెక్టర్‌ ప్రవీణ్‌ఆదిత్య అధికారులను ఆదేశించారు. మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం నిర్వహించిన దూరదృశ్య సమావేశంలో ఆయన మాట్లాడి పలు సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని