logo

మేకను చంపిన చిరుతపులి!

పోలవరం మండలం వింజరం పంచాయతీ సున్నాలగొంది గ్రామంలో చిరుతపులి మేకను చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

Published : 27 Jun 2024 04:17 IST

కళేబరాన్ని పరిశీలిస్తున్న అటవీ శాఖ సిబ్బంది

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం మండలం వింజరం పంచాయతీ సున్నాలగొంది గ్రామంలో చిరుతపులి మేకను చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మడకం కోటేశ్వరరావు మేకలను ఇంటి సమీపంలో ఉంచి మేపుతున్నాడు. రెండ్రోజులుగా అందులో ఒకటి కనిపించలేదని అడవిలో గాలిస్తుండగా బుధవారం దాని కళేబరం కనిపించింది. దీనిపై పోలవరం అటవీశాఖధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించారు. పరిసరాల్లో చిరుత పులి తిరుగుతోందని ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని, పశువులను బయటకు వదలొద్దని ఇన్‌ఛార్జి రేంజర్‌ ఎం.దావీద్‌రాజు విజ్ఞప్తి చేశారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని