logo

ఇన్నాళ్ల్లూ కళ్లు మూసుకున్నారా?

అనుమతులు లేకుండా వైకాపా జిల్లా కార్యాలయ భవనం అక్రమంగా నిర్మిస్తుంటే ఇన్నాళ్లూ కళ్లు మూసుకున్నారా అని ఎమ్మెల్యే బడేటి చంటి నగరపాలక సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 27 Jun 2024 03:54 IST

వైకాపా అక్రమ  నిర్మాణంపై ఎమ్మెల్యే ఆగ్రహం

కమిషనర్‌ వెంకటకృష్ణను ప్రశ్నిస్తున్న చంటి 
ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: అనుమతులు లేకుండా వైకాపా జిల్లా కార్యాలయ భవనం అక్రమంగా నిర్మిస్తుంటే ఇన్నాళ్లూ కళ్లు మూసుకున్నారా అని ఎమ్మెల్యే బడేటి చంటి నగరపాలక సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులోని వైకాపా జిల్లా కార్యాలయాన్ని బుధవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... వైకాపా దుర్మార్గ పాలనా విధానాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని.. వాటన్నింటినీ కూకటివేళ్లతో పెకిలిస్తామన్నారు. నగరంలో ఇతరులకు కేటాయించిన స్థలాన్ని వైకాపా నాయకులు అక్రమంగా బదలాయించుకుని... ఆ స్థలంలో నిబంధనలు పాటించకుండా కార్యాలయం నిర్మించారన్నారు. 30 ఏళ్లకు పైగా కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకున్నట్లు దస్త్రాలు సృష్టించారన్నారు. గతంలో స్థలానికి సంబంధించి ఎలాంటి చెల్లింపులు చేయలేదని... ఇప్పుడు హడావుడిగా రూ.12 లక్షలు ఇచ్చి అధికారికంగా చేయాలని చూస్తున్నారన్నారు. దీన్ని ఏమాత్రం సహించబోమని చంటి స్పష్టం చేశారు. ఆయన వెంట కమిషనర్‌ సంక్రాంతి వెంకటకృష్ణ, పలువురు తెదేపా నాయకులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని