logo

కొల్లేరులో అర్ధరాత్రి అక్రమ తవ్వకాలు

కొల్లేరులో చెరువుల అక్రమ తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి యంత్రాలతో తవ్వేస్తున్నారు.

Published : 27 Jun 2024 03:50 IST

అడ్డుకున్న అటవీశాఖ అధికారులు 

 తవ్వేసి ఏర్పాటు చేసిన గట్టు

కైకలూరు, న్యూస్‌టుడే: కొల్లేరులో చెరువుల అక్రమ తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి యంత్రాలతో తవ్వేస్తున్నారు. కైకలూరు మండలం పల్లెవాడ పెట్రోల్‌బంకు సమీపంలో సుమారు 10 ఎకరాల్లో కొందరు.. అక్రమ చెరువు తవ్వకాలు చేస్తున్నారు.   రాత్రి సమయంలో మాత్రమే పొక్లెయిన్‌ యంత్రాలతో గట్లు నిర్మిస్తూ పగలు యంత్రాలను కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈక్రమంలో ఒకవైపు చెరువుగట్టు పూర్తిగా ఏర్పాటు చేసుకోగా దీనికి సమీపంలో ఉన్న జవ్వ కనుమల మురుగు డ్రెయినేజీలో కొంత భాగాన్ని సైతం అక్రమించి గట్టు ఏర్పాటు చేయడం గమనార్హం. సమాచారం తెలుసుకున్న కైకలూరు అటవీశాఖ డీఆర్వో జయప్రకాశ్‌ సిబ్బందితో కలిసి అక్రమ తవ్వకాలను బుధవారం పరిశీలించారు.  మరో యంత్రాన్ని తీసుకువచ్చి అక్రమంగా వేసిన చెరువుగట్టును అధికారులు ధ్వంసం చేశారు. అటవీశాఖ నిబంధనలను అతిక్రమించి కొల్లేరును ఆక్రమించాలని ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్వో హెచ్చరించారు. 


చెరువు గట్టును ధ్వంసం చేయిస్తున్న అటవీశాఖ అధికారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని