logo

అసంపూర్తి పనులతో అవస్థలు!

ఏలూరు తూర్పువీధిలోని శ్రీకృష్ణదేవరాయ నగరపాలకోన్నత పాఠశాలలో అసంపూర్తి గదిలో బోధనకస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాల రెండో అంతస్తులో అసంపూర్తి నిర్మాణంఏలూరు పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు అసంపూర్తిగా ఉన్నాయి

Published : 27 Jun 2024 03:38 IST

ఏలూరు తూర్పువీధిలోని శ్రీకృష్ణదేవరాయ నగరపాలకోన్నత పాఠశాలలో అసంపూర్తి గదిలో బోధన

ఏలూరు పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు అసంపూర్తిగా ఉన్నాయి. ఏలూరు తూర్పువీధిలోని శ్రీకృష్ణదేవరాయ నగరపాలకోన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడంతో 14వ ఆర్థిక సంఘం నిధులతో ఆరు అదనపు గదుల నిర్మాణాలను చేపట్టారు. వాటిని పూర్తిచేయకుండానే రెండో అంతస్తులో నాడు-నేడు పేరుతో మరో ఆరుగదుల నిర్మాణాలను చేపట్టారు. అవికూడా పూర్తికాకపోవడంతో ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న గదుల్లోనే విద్యాబోధన చేశారు. ఏలూరులోని ఏఆర్‌డీజీకే నగరపాలకోన్నత పాఠశాలలోనూ 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన నాలుగు అదనపు గదులు పూర్తికాలేదు. ఏలూరులోని కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాల రెండో అంతస్తులో అదనపు గదుల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. చాటపర్రులోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో రూ.60లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అదనపు గదులు పునాదుల దశలోనే ఉన్నాయి. సత్రంపాడులోని ఉన్నత పాఠశాల ఆవరణలో  2022లో రూ.1.2 కోట్ల అంచనా అంచనా వ్యయంతో చేపట్టిన అదనపు గదుల నిర్మాణం నేటికీ పూర్తికాలేదు. వైకాపా ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో అదనపు గదులను పూర్తిచేయడంపై దృష్టి సారించలేదని ఏలూరులో వైకాపా పార్టీ కార్యాలయాన్ని మాత్రం ఆగమేఘాలపై పూర్తిచేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమగ్ర శిక్షా అభియాన్‌ ఏపీసీ సోమశేఖర్‌ మాట్లాడుతూ అదనపు గదుల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో పూర్తి చేస్తామన్నారు.

కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాల రెండో అంతస్తులో అసంపూర్తి నిర్మాణం
- ఈనాడు, ఏలూరు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని