logo

Kalki: ‘కల్కి’ కారులో ఎమ్మెల్యే రఘురామ సందడి!

‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కథానాయకుడు ప్రభాస్‌ నడిపిన ప్రత్యేక కారును భీమవరం ఏవీజీ సినిమాస్‌ మల్టీప్లెక్స్‌లో ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. వీక్షకులు భారీగా తరలివచ్చి ఈ కారు ఎదుట స్వీయ చిత్రాలు తీసుకున్నారు.

Published : 03 Jul 2024 04:45 IST

ప్రత్యేక కారులో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో కథానాయకుడు ప్రభాస్‌ నడిపిన ప్రత్యేక కారును భీమవరం ఏవీజీ సినిమాస్‌ మల్టీప్లెక్స్‌లో ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. వీక్షకులు భారీగా తరలివచ్చి ఈ కారు ఎదుట స్వీయ చిత్రాలు తీసుకున్నారు. సుమారు రూ.6 కోట్లతో ఈ కారును రూపొందించినట్లు కోస్టల్‌ సిటీ సెంటర్‌ మేనేజర్‌ శివరామరాజు, ఏవీజీ సినిమాస్‌ మేనేజర్‌ మధు పేర్కొన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మంగళవారం రాత్రి ఈ కారులో కూర్చొని సందడి చేశారు.

ప్రాంగణంలో సందర్శకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని