logo

నజరానా కాదు.. తెరిస్తే ఖాతా ఖాళీ..

చరవాణి ఉన్నవారికి రెండు మూడు రోజులుగా వస్తున్న ఒక సంక్షిప్త సందేశం ఎంతో ప్రమాదకరమైందని నిపుణులు చెపుతున్నారు.

Updated : 04 Jul 2024 06:19 IST

చరవాణి ద్వారా అందిన సమాచారం 

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: చరవాణి ఉన్నవారికి రెండు మూడు రోజులుగా వస్తున్న ఒక సంక్షిప్త సందేశం ఎంతో ప్రమాదకరమైందని నిపుణులు చెపుతున్నారు. పరిమితికి మించి ఆదాయం వస్తున్న వేతనజీవులు ప్రతియేటా పన్ను చెల్లిస్తుంటారు. చెల్లించిన పన్ను అధికంగా ఉందని ఈ మొత్తం మీ పొదుపు ఖాతాకు మళ్లించినట్లు తెలుపుతూ ఖాతా నెంబర్‌లో తేడా ఉంటే దిగువనున్న లింక్‌ క్లిక్‌ చేయమని సూచిస్తున్నారు. ఇలాంటి లింక్‌ను ఓపెన్‌ చేస్తే డబ్బులు ఖాళీ అవుతాయని సైబర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఆ శాఖ నుంచి ఇలాంటి సందేశాలు రావని, సైబర్‌ నేరగాళ్లు ఇలా పంపిస్తారని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని