logo

6 నుంచి శ్రీభద్రకాళి శాకాంబరి మహోత్సవాలు

తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన శ్రీభద్రకాళి అమ్మవారి శాకాంబరి మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 21 వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు.

Updated : 04 Jul 2024 06:18 IST

 కరపత్రాలు విడుదల చేస్తున్న వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, ప్రధానార్చకుడు శేషు, ఈవో శేషుభారతి తదితరులు 

రంగంపేట, న్యూస్‌టుడే: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన శ్రీభద్రకాళి అమ్మవారి శాకాంబరి మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 21 వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 6న ఉదయం ఉత్సవాలు ప్రారంభం, ఉదయం 10 గంటలకు శ్రీభద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం జరుగుతుందన్నారు. బుధవారం దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడారు. రూ.30 కోట్లతో భద్రకాళి ఆలయం చుట్టూ మాడవీధులు, రాజగోపురాలు తదితర అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రధానార్చకుడు శేషు మాట్లాడుతూ.. భారత దేశంలోని అన్ని ఆలయాల్లో వసంత, శరన్నవరాత్రులు విధిగా జరుపుతారని, నవరాత్ర చతుష్టయిం మన ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో మాత్రమే నిర్వహిస్తారన్నారు. 21న ఆషాఢ శుద్ధ పౌర్ణమి పర్వదినాన అమ్మవారిని వివిధ రకాలైనా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లతో అలంకరిస్తారన్నారు. ఈవో శేషుభారతి మాట్లాడుతూ.. శాకాంబరి ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్యూలైన్లు, తాగునీటి వసతి, ప్రసాదాల పంపిణీ ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. సమావేశంలో దేవస్థానం పర్యవేక్షకుడు విజయ్, కార్పొరేటర్లు, అర్చకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని