logo

‘కుడా’ తీరే వేరు!

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) తీరే వేరు. అభివృద్ధి పనుల టెండర్లు కొంతమంది బడా గుత్తేదారులకు దక్కేలా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దానికి బలం చేకూర్చేలా టెండర్లు సకాలంలో తెరవడం లేదు.

Published : 03 Jul 2024 05:14 IST

కార్పొరేషన్, న్యూస్‌టుడే: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) తీరే వేరు. అభివృద్ధి పనుల టెండర్లు కొంతమంది బడా గుత్తేదారులకు దక్కేలా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దానికి బలం చేకూర్చేలా టెండర్లు సకాలంలో తెరవడం లేదు. భద్రకాళి బండ్‌ ప్రధానద్వారం రోడ్డు, గాయత్రి దేవాలయం ముందు భాగంలో ల్యాండ్‌ స్కేపింగ్, గ్రీనరీ, అవెన్యూ ప్లాంటేషన్, ఆకర్షణీయ మొక్కలు తదితర పనుల కోసం రూ.35 లక్షలతో ప్రతిపాదించారు. గత నెల 16న ఆన్‌లైన్‌లో ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 20వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు టెండర్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. అయిదు టెండరు దరఖాస్తులు వచ్చాయి. నిబంధనల ప్రకారమైతే అదేరోజు సాయంత్రం, లేదా మరుసటిరోజు టెండర్‌ ఓపెన్‌ చేయాలి. పది రోజులవుతున్నా రూ.35 లక్షల టెండర్‌ తెరవక పోవడాన్ని గత్తేదారులు తప్పుబడుతున్నారు. అధికారులకు దగ్గరగా ఉండే గుత్తేదారు ఎక్కువశాతం టెండర్‌ వేశారని, అతనికి కాంట్రాక్టు వచ్చే అవకాశాలు లేవని టెండర్‌ ఓపెన్‌ చేయడం లేదంటున్నారు. ఇవేగాక మరికొన్ని టెండర్లు తెరవకుండా ఆలస్యం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ‘కుడా’ ఇంజినీర్ల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వీసీ దృష్టికి తీసుకెళ్తాం: - భీంరావు, ఈఈ, కుడా

కుడా కొత్త వైస్‌ ఛైర్మన్‌(వీసీ) బాధ్యతలు చేపట్టారు. సీఎం పర్యటన, ఇతర పనుల ఒత్తిడితో టెండర్లు తెరవలేదు. వీసీ దృష్టికి తీసుకెళ్లి.. త్వరలో ఓపెన్‌ చేస్తాం. తెరవాల్సినవి ఒకటి కంటే ఎక్కువే ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని