logo

వసతి గృహాలు.. సమస్యల లోగిళ్లు..!

సంక్షేమ వసతి గృహాల్లో అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. శిథిÅల భవనాలు, మూత్రశాలల కొరత, తలుపులు లేని మరుగుదొడ్లు, అస్తవ్యస్థ పరిసరాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల శాఖల ఆధ్వర్యంలో 20 ఫ్రీ, పోస్టు మెట్రిక్‌ వసతి గృహాలను నిర్వహిస్తున్నారు.

Published : 03 Jul 2024 05:12 IST

వెంకటాపురం, న్యూస్‌టుడే: సంక్షేమ వసతి గృహాల్లో అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. శిథిÅల భవనాలు, మూత్రశాలల కొరత, తలుపులు లేని మరుగుదొడ్లు, అస్తవ్యస్థ పరిసరాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల శాఖల ఆధ్వర్యంలో 20 ఫ్రీ, పోస్టు మెట్రిక్‌ వసతి గృహాలను నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 1,528 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఆయా వసతి గృహాలను మంగళవారం ‘న్యూస్‌టుడే’ బృందం పరిశీలించగా పలు సమస్యలు వెలుగుచూశాయి.

మరమ్మతుల్లో నిర్లక్ష్యం

అత్యవసర మరమ్మతులకు ఒక్కొ హాస్టల్‌కు రూ.20 వేలు మంజూరు చేశారు. విద్యుత్తు లైట్లు, ఫ్యాన్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, నీటి సదుపాయం, పరిసరాల పరిశుభ్రతకు ఈ నిధులను వెచ్చించాలని ప్రణాళిక చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక అధికారులను పర్యవేక్షణకు నియమించినా మరమ్మతుల్లో నిర్లక్ష్యం చోటుచేసుకుంది. ఒకటి రెండు చోట్ల మినహా అంతటా అసంపూర్తిగానే ఉన్నాయి. బీసీ వసతి గృహాల్లో సమస్యల పరిష్కారానికి ఒక్క చోట రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల నిధులు అవసరమని, ఎస్సీ హాస్టల్‌లో రూ.లక్ష నిధులు సమకూర్చాలని గతేడాది ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి.

అధికారులు ఏమంటున్నారంటే..

గిరిజన సంక్షేమ శాఖచే వసతి గృహాల్లో సదుపాయాల కల్పన పనులు కొనసాగుతున్నాయని ఐటీడీఏ డీడీ పోచం అన్నారు. త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. వసతి గృహాల్లోని మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఇతర సమస్యల పరిష్కారానికి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి సీహెచ్‌ రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ హాస్టళ్లలో సదుపాయాల కల్పనకు నిధుల మంజూరుకు ఎదురుచూస్తున్నామని ఆ శాఖ జిల్లా అధికారి లక్ష్మణ్‌నాయక్‌ వివరించారు.


ధ్వంసమైన ప్రధాన మార్గం

వసతిగృహం: బీసీ బాలుర వసతి గృహం, వెంకటాపురం
విద్యార్థుల సంఖ్య: 22 మంది
వసతుల సౌకర్యం: పిచ్చిమొక్కలతో పరిసరాలు అస్తవ్యస్థంగా ఉన్నాయి.
కిటికీలకు తలుపులు, జాలీలు, ఫ్యాన్లు, దీపాలు: జాలీలు ఏర్పాటు చేయాలి. గదుల్లో లైట్లు, ఫ్యాన్లు అమర్చాలి.
మరుగుదొడ్లు, మూత్రశాలలు: మరుగుదొడ్లకు వెళ్లే మార్గం అధ్వాన్నంగా ఉంది.


జాలీలులేని కిటికీలు.. ఇరుకు గదులు

  • ఎస్సీ బాలుర వసతి గృహం, వాజేడు
  • 76 మంది
  • ఇరుకైన మూడు గదుల్లోనే ఉండాల్సివస్తోంది. వసతి అసౌకర్యంగా ఉంది.
  • తుప్పు పట్టిన ఇనుప తలుపులు. జాలీలు లేవు. లైట్లు, ఫ్యాన్లు ఉన్నాయి.
  • మరమ్మతులు చేయాల్సి ఉంది.

న్యూస్‌టుడే, వాజేడు


అధ్వానంగా మరుగుదొడ్లు

ములుగు పట్టణంలో ఎస్టీ వసతి గృహంలో 80 మంది, ఎస్సీ హాస్టల్‌లో ఐదుగురు, బీసీలో ఆరుగురు ఉన్నారు. ఎస్సీ, బీసీ వసతి గృహాలు రెండు ఒకే క్యాంపస్‌లో నిర్వహిస్తున్నారు. ఎస్టీ హాస్టల్‌లో గదులకు సరిగా తలుపులు లేవు. ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో నీటి శుద్ధీరణ యంత్రం పాడైపోయింది. కొన్ని మరుగుదొడ్లలో చెట్లు మొలిచాయి

న్యూస్‌టుడే, ములుగు టౌన్‌


శిథిలావస్థలో గదులు

  • గిరిజన బాలుర వసతిగృహం, పస్రా
  • 67 మంది
  • భవనం శిథిలావస్థకు చేరింది. స్లాబ్‌ పెచ్చులూడుతున్నాయి.
  • జాలీలు, తలుపులు లేవు. ఫ్యాన్లు, విద్యుత్తు దీపాలు ఉన్నాయి.
  • మరుగుదొడ్లు, స్నానపు గదులు అస్తవ్యస్థంగా ఉన్నాయి.

న్యూస్‌టుడే, గోవిందరావుపేట


అసంపూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణం

  • బీసీ బాలుర వసతి గృహం, ఏటూరునాగారం
  • 35 మంది
  • ప్రహరీ పూర్తిస్థాయిలో లేదు. కిచెన్‌ షెడ్డు సరిగా లేక వంట చేయడం ఇబ్బందిగా ఉంది.
  • తుప్పు పడుతున్నాయి. జాలీలు లేవు. లైట్లు, ఫ్యాన్లు ఉన్నాయి.
  • తలుపులు సరిగా లేవు. మూడేళ్ల క్రితం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. ఇంతవరకు పూర్తికాలేదు.

న్యూస్‌టుడే, ఏటూరునాగారం


నిరుపయోగంగా బోరు

  • ఎస్టీ బాలుర హాస్టల్, తిమ్మంపేట, మంగపేట
  • 75 మంది
  • నీటి వసతి లేదు. హాస్టల్‌లో ఉన్న బోరు మరమ్మతుకు గురైంది.
  • తలుపులు, జాలీలు, లైట్లు, ఫ్యాన్లు ఉన్నాయి.
  • సరిగానే ఉన్నాయి.

న్యూస్‌టుడే, మంగపేట


జిల్లా గణాంకాలు ఇలా

ఎస్టీ  8   776
ఎస్సీ  6   300
బీసీ  6  450

  • శాఖ
  • వసతి గృహాలు
  • విద్యార్థుల సంఖ్య
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని