logo

వేప చెట్లతో చిట్టడవిని సృష్టించాడు

ఈ చిత్రంలో వేప వనంలో కనిపిస్తున్న రైతు పేరు సుంకరి శ్రీనివాస్‌రెడ్డి. జనగామ మండలం సిద్దెంకి గ్రామం. పర్యావరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. 2013లో తనకున్న 10 ఎకరాల్లో ఐదు వేల వేప మొక్కలను నాటారు.

Updated : 01 Jul 2024 06:18 IST

ఈ చిత్రంలో వేప వనంలో కనిపిస్తున్న రైతు పేరు సుంకరి శ్రీనివాస్‌రెడ్డి. జనగామ మండలం సిద్దెంకి గ్రామం. పర్యావరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. 2013లో తనకున్న 10 ఎకరాల్లో ఐదు వేల వేప మొక్కలను నాటారు. ప్రస్తుతం అవి అడవిని తలపించేలా పెరిగాయి. కాయలు ఔషధాలుగా ఉపయోగపడుతున్నాయి. దీంతో పాటు వ్యవసాయ బావి వద్ద 15 చింత చెట్లను నాటారు. జనగామ వంటి కరవు దుర్భిక్ష ప్రాంతాల్లో ఇలాంటి వనాల ఏర్పాటుకు పాటుపడితే వర్షాలు విరివిగా కురవడానికి వీలుంటుందని పలువురు ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. తనకు చిన్న నాటి నుంచే మొక్కల పెంపకం, సంరక్షణ అంటే ఇష్టమని రైతు శ్రీనివాస్‌రెడ్డి చెపుతున్నారు. రేపటి తరానికి ఆరోగ్యకర జీవితం అందాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచిస్తున్నారు. 

జనగామ రూరల్, న్యూస్‌టుడే 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని