logo

ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన అవసరం

ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని ఎన్‌హెచ్‌ఎం సీనియర్‌ రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధ అన్నారు. ములుగులో డీఎంహెచ్‌వో డాక్టర్‌ అప్పయ్య అధ్యక్షతన ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

Published : 29 Jun 2024 05:04 IST

మాట్లాడుతున్న ఎన్‌హెచ్‌ఎం సీనియర్‌ రీజినల్‌ డైరెక్టర్‌ అనురాధ

ములుగు, న్యూస్‌టుడే: ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని ఎన్‌హెచ్‌ఎం సీనియర్‌ రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధ అన్నారు. ములుగులో డీఎంహెచ్‌వో డాక్టర్‌ అప్పయ్య అధ్యక్షతన ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వైద్యాధికారి ప్రతి ఆరోగ్య కార్యక్రమానికి ఒక మార్గదర్శిగా ఉండాలన్నారు. వైద్యులు సేవానిరతితో రోగులకు సేవలందించాలని సూచించారు. దేవుని తర్వాత ప్రజలు కొలిచేది డాక్టర్లనేనని, వైద్యులుగా సేవలందించడం గర్వంగా భావించాలన్నారు. మన దేశంలో ఆరోగ్య కార్యక్రమాలపై భారత ప్రభుత్వం ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసిందని, దాని ద్వారానే మనం కొవిడ్‌ లాంటి అతి క్లిష్టమైన సమయంలో కూడా ప్రజలకు సేవలు అందించామన్నారు. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సేవలను వినియోగించుకునేలా చూడాలన్నారు. వైద్యాధికారులు సమయ పాలన పాటించాలని, ప్రతి ఆరోగ్య కార్యక్రమంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. డీఎంహెచ్‌వో అప్పయ్య మాట్లాడుతూ.. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేసేందుకు వైద్యాధికారులు, మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు, వైద్య సిబ్బంది తమ వంతుగా కృషి చేసి జిల్లాను ముందువరుసలో నిలపాలని కోరారు. జయశంకర్‌ భూపాలపల్లి డీఎంహెచ్‌వో మధుసుదన్, ప్రోగ్రాం అధికారులు రవీందర్, పవన్, శ్రీకాంత్, రణధీర్, డెమో తిరుపతయ్య, రెండు జిల్లాల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని