logo

నూతన చట్టాలపై అవగాహన అవసరం

జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన చట్టాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది నూతన చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు.

Published : 29 Jun 2024 05:00 IST

మాట్లాడుతున్న ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌

నెహ్రూసెంటర్, న్యూస్‌టుడే: జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన చట్టాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది నూతన చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు. నూతన చట్టాలపై మహబూబాబాద్‌ పట్టణంలో పోలీస్‌ అధికారులు, సిబ్బందికి దశలవారీగా నిర్వహించిన శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి.  ముగింపు కార్యక్రమానికి హాజరైన ఎస్పీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన చట్టాలను అనురిస్తూ ముందుకు సాగాలన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్ల గురించి తెలుసుకోవాలన్నారు. ఏఎస్పీ జోగుల చెన్నయ్య, డీసీఆర్‌బీ డీఎస్పీ గండ్రాతి మోహన్, మహబూబాబాద్‌ డీఎస్పీ తిరుపతిరావు, డోర్నకల్‌ సీఐ ఉపేందర్, ఎస్సై రమాదేవి శిక్షణ సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి

కురవి: ఫిర్యాదులు చేసిన వెంటనే బాధ్యతతో వెంటనే స్పందించాలని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు. శుక్రవారం ఆయన కురవి ఠాణాను తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గార్డెన్‌తో పాటు స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించారు. 100 డయల్‌ రాగానే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కారం చేయాలన్నారు. రౌడీ షీˆటర్లు, పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా పెట్టాలని బ్లూ కోల్ట్స్‌ సిబ్బందిని ఆదేశించారు. సీఐ సర్వయ్య, ఎస్సై గోపి సిబ్బంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని