logo

తాగునీటి సీసా.. తప్పని ప్రయాస

గుక్కెడు మంచినీళ్ల కోసం ఆ తండావాసులు ప్లాస్టిక్‌ సీసాలు పట్టుకొని పిల్లా పాపలతో బోరు వద్దకు బయలుదేరి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లా చిల్పూర్‌ మండలం తీగలతండా గ్రామపంచాయతీ పరిధిలోని వాచ్యతండా వాసుల నీటి కష్టాలివి.

Published : 29 Jun 2024 04:56 IST

గుక్కెడు మంచినీళ్ల కోసం ఆ తండావాసులు ప్లాస్టిక్‌ సీసాలు పట్టుకొని పిల్లా పాపలతో బోరు వద్దకు బయలుదేరి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లా చిల్పూర్‌ మండలం తీగలతండా గ్రామపంచాయతీ పరిధిలోని వాచ్యతండా వాసుల నీటి కష్టాలివి. 40 కుటుంబాలు ఉండే ఈ తండాలో సమీపంలోనే నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద బోరు నీటిని ఇలా తీసుకెళ్తున్నారు. వేసవిలో పరిస్థితి అధికమై, వ్యవసాయ బావుల వద్దకు వెళ్తామని తండా వాసి బానోతు లక్ష్మి తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా అంతంత మాత్రమే అందుతున్నాయని, వాటిని అవసరాలకు మాత్రమే వాడుతామని, అధికారులు స్పందించి మంచి నీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. ఈ విషయంపై మండల పంచాయతీ అధికారి ఎస్‌.మధుసూదన్‌ వివరణ ఇస్తూ.. తండాలో భగీరథ ట్యాంక్‌ ఉందని, దాని ద్వారానే మంచినీరు సరఫరా చేస్తున్నామని, ఆ నీళ్లకు వారు సుముఖత చూపడం లేదని తెలిపారు.

ఈనాడు, హనుమకొండ, న్యూస్‌టుడే, చిల్పూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని