logo

ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ

భారతదేశ మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణల పితామహుడని కలెక్టర్‌ ప్రావీణ్య అన్నారు. భారతరత్న పీవీ జయంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ బస్టాండ్‌ కూడలిలోని ఆయన విగ్రహం వద్ద జిల్లా యంత్రాంగం అధికారిక ఉత్సవాలు నిర్వహించింది.

Published : 29 Jun 2024 04:54 IST

పీవీకి నివాళి అర్పించిన కలెక్టర్‌ ప్రావీణ్య, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి,
శాసన మండలి డిప్యూటీ  ఛైర్మన్‌ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

వరంగల్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే : భారతదేశ మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణల పితామహుడని కలెక్టర్‌ ప్రావీణ్య అన్నారు. భారతరత్న పీవీ జయంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ బస్టాండ్‌ కూడలిలోని ఆయన విగ్రహం వద్ద జిల్లా యంత్రాంగం అధికారిక ఉత్సవాలు నిర్వహించింది. కలెక్టర్‌ ప్రావీణ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఓరుగల్లులో జన్మించి, ప్రధాన మంత్రిగా దేశ ఆర్థిక స్థితిగతులను మార్చిన మహనీయుడు పీవీ అని కొనియాడారు. కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండ ప్రకాశ్, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకాడే, అదనపు కలెక్టర్‌ రాధికా గుప్తా, వరంగల్‌ మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, పీవీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని