logo

ప్రతి నెలా ‘ఆరుద్రోత్సవం’

రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి నెల ఆరుద్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి చారిత్రక, సాహిత్య నేపథ్యం ఎంతో ఉంది.

Published : 29 Jun 2024 04:48 IST

రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి నెల ఆరుద్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికి చారిత్రక, సాహిత్య నేపథ్యం ఎంతో ఉంది. అయితే గత 13 నెలలుగా సోమేశ్వరాలయంలో ఆరుద్రోత్సవ పూజలను జరుపుతున్నారు. ఈ తరహా విధానం రాష్ట్రంలో మరెక్కడా లేదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.

ఆరుద్రోత్సవంలో గర్భాలయం.. 

వైభవంగా నిర్వహణ..: దేవదేవుడైన శివుడిది ‘ఆరుద్ర’ నక్షత్రం. నెలకు ఒకసారి ప్రత్యక్షం కావడంతో ప్రీతిపాయం. తమిళనాడులోని పలు ఆలయాల్లో ఇప్పటికే ఈ తరహా ప్రత్యేక పూజలను జరుపుతున్నారు. ఇక్కడి అర్చకులు దక్షణాది రాష్ట్ర దేవస్థానాల సందర్శనకు వెళ్లినప్పుడు ఆరా తీయగా వారు వివరించారు. అప్పటి నుంచి(2023 ఏప్రిల్‌) సోమేశ్వరాలయంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి ప్రయత్నంలోనే విజయవంతం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకిస్తున్నారు. మేళతాళాలతో, భజన సంకీర్తనలతో తొలుత గణపతి పూజతో ప్రారంభమవుతుంది. 108 లీటర్ల ఆవు పాలతో స్వామివారికి అభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే 108 దీపాలతో గర్భాలయ అలంకరణ, భారీ గజమాలతో విశేష పూజలు, నీరాజనములు, అన్నప్రసాద తీర్థవితరణ నిర్వహిస్తారు. ఏకహారతి, పంచ, కుంభ, కర్పూర, నక్షత్ర హారతులను స్వామివారికి ఇస్తుంటారు.


భక్తులు అధికంగా పాల్గొంటున్నారు..

- దేవగిరి అనిల్‌ శర్మ, అర్చకుడు

నిర్వహణకు దేవస్థానం ఈవో, అధికారుల సహాయ సహకారాలు మరువలేనివి. తొలుత 60 మంది భక్తులు పాల్గొనగా, నేడు పలు జిల్లాల నుంచి 400 మంది వరకు పాల్గొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని