logo

జై భద్రకాళి.. జై తుల్జా భవానీ..

ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు మంగళవారం పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేశారు. వరంగల్‌ ఎంపీ కడియం కావ్య తన ప్రమాణ స్వీకారం ప్రక్రియ పూర్తయ్యాక ‘జై భద్రకాళి’ అంటూ ఓరుగల్లు అమ్మవారిని స్మరించుకున్నారు.

Updated : 26 Jun 2024 05:36 IST

వరంగల్‌ ఎంపీ కడియం కావ్య

ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు మంగళవారం పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేశారు. వరంగల్‌ ఎంపీ కడియం కావ్య తన ప్రమాణ స్వీకారం ప్రక్రియ పూర్తయ్యాక ‘జై భద్రకాళి’ అంటూ ఓరుగల్లు అమ్మవారిని స్మరించుకున్నారు. ఆ తర్వాత ‘జై భీమ్‌’ అని నినదించారు. అంతకు ముందు ఆమె తన తండ్రి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జాతీయ సమన్వయకర్త కొప్పుల రాజును కలిశారు.

మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాంనాయక్‌

మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాంనాయక్‌ పార్లమెంటు సభ్యుడిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణం పూర్తయ్యాక గిరిజనుల ఆరాధ్యదైవం జై తుల్జా భవానీ, జై తెలంగాణ అంటూ నినదించారు. ఆయన్ను డోర్నకల్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ జాటోత్‌ రామచంద్రునాయక్‌తో పాటు  పలువురు నాయకులు అభినందించారు.

ఈనాడు, వరంగల్, మహబూబాబాద్, న్యూస్‌టుడే, మహబూబాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని