logo

అధ్వాన రోడ్లకు త్వరలో మోక్షం

ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఒక గుంతను పూడ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రీయ రహదారుల నుంచి గ్రామీణ ప్రాంత దారుల వరకు అన్నీ అధ్వానంగా దర్శనం ఇస్తున్నాయి.

Published : 03 Jul 2024 04:55 IST

రూ.80 కోట్లతో ప్రతిపాదనలు

మరమ్మతులకు గురైన రామభద్రపురం- బొబ్బిలి రహదారి 

న్యూస్‌టుడే, బొబ్బిలి: ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఒక గుంతను పూడ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రీయ రహదారుల నుంచి గ్రామీణ ప్రాంత దారుల వరకు అన్నీ అధ్వానంగా దర్శనం ఇస్తున్నాయి. ఈ గోతుల్లో పడి వాహన చోదకులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు అనేకం. ఇప్పుడు వాటికి మోక్షం కలిగే రోజులొచ్చాయి. రోడ్ల పరిస్థితిపై నివేదికలు ఇవ్వాలని కొత్త ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ పనిలో పడ్డారు. బొబ్బిలి సబ్‌ డివిజన్‌ పరిధిలోని బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల పరిధిలో కొన్ని ముఖ్య రహదారుల మరమ్మతులకు రూ.80 కోట్లతో తాజాగా ప్రతిపాదనలు పంపారు.

మేజర్‌ జిల్లా రహదారులు (ఎండీఆర్‌) బొబ్బిలి సబ్‌ డివిజన్‌లో 35 ఉన్నాయి. వాటన్నింటికి మరమ్మతులు చేయాల్సి ఉందని ఇంజినీర్లు స్పష్టం చేశారు. వీటిలో ఉన్న 5 రాష్ట్రీయ రహదారులను పూరిస్థాయిలో ఆధునికీకరించాల్సి ఉందని పేర్కొన్నారు. వీటిలో కొన్ని రహదారుల విస్తరణ కూడా చేపట్టనున్నారు. మరికొన్ని చోట్ల కల్వర్టుల మరమ్మతులకు దస్త్రాలు సిద్ధం చేసి, నివేదించారు. అత్యవసర పనుల కింద నిధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

ప్రతిపాదిత పనుల్లో కొన్ని..

  •  తెర్లాం-బొబ్బిలి రహదారి విస్తరణ, మరమ్మతులు: రూ.30 కోట్లు
  •  ఆకులకట్ట- పినపెంకి రోడ్డు విస్తరణ, మరమ్మతులు: రూ.15 కోట్లు
  • ఉత్తరావల్లి- లచ్చయ్యపేట (సీఆర్‌ఆర్‌) మధ్య దారి మరమ్మతులు: రూ.10 కోట్లు
  • పెంట రోడ్డు విస్తరణ, మరమ్మతులు: రూ.20 కోట్లు
  • ఇతర మార్గాల మరమ్మతులకు మరో రూ.10 కోట్లు నిధులు అవసరమని నివేదించారు.

కల్వర్టులపై దృష్టి

  • బొబ్బిలి- పారాది మధ్య నిర్మాణానికి రూ.2.5 లక్షలు,
  • బొబ్బిలి- మెట్టవలస మధ్య రూ.45 లక్షలు,
  • బొబ్బిలి-తెర్లాం కల్వర్టుకు రూ.8.1 లక్షలు. 

     తాజా అంచనాలు పంపాం 

గత ప్రభుత్వంలో రహదారుల మరమ్మతులకు నిధులు కోరుతూ అంచనాలు పంపాం. నిధులు రాలేదు. ఇప్పుడు మళ్లీ రోడ్ల దుస్థితిపై నివేదికలు ఇవ్వాలని ఉన్నతాధికారులు కోరారు. దీంతో కొత్తగా అంచనాలు వేసి, పంపాం. ఒక్క బొబ్బిలి సబ్‌ డివిజన్‌ పరిధిలో రూ.80 కోట్లకు ప్రతిపాదనలు పంపాం. ఇక్కడ రహదారులు అన్నీ పాడయ్యాయి. కల్వర్టులు కూడా శిథిలావస్థకు చేరాయి.

- అప్పలరాజు, ర.భ.శాఖ ఏఈ  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు