logo

4.26 లక్షల మందికి రూ.283.59 కోట్లు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. విజయనగరం జిల్లాలో 2,81,713 మందికి రూ.186.89 కోట్లు, మన్యంలో 1,44,518 మందికి రూ.96.70 కోట్లు అందించనున్నారు.

Published : 01 Jul 2024 05:34 IST

నేడు లబ్ధిదారులకు పింఛను నగదు పంపిణీ

సీఎం సంతకంతో పింఛనుదారులకు లేఖ 

విజయనగరం మయూరికూడలి, గ్రామీణం, ఉడాకాలనీ, రాజాం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. విజయనగరం జిల్లాలో 2,81,713 మందికి రూ.186.89 కోట్లు, మన్యంలో 1,44,518 మందికి రూ.96.70 కోట్లు అందించనున్నారు. శనివారం బ్యాంకుల్లో నగదు పడగా.. ఇప్పటికే సచివాలయాల కార్యదర్శులు విత్‌డ్రా చేశారు. నగదుతో పాటు, రసీదు, సీఎం చంద్రబాబు నాయుడు పేరిట ఉన్న కరపత్రాన్ని ఇస్తారు. సోమవారం ఆరు గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు సచివాలయాల సిబ్బంది వెళ్లనున్నారు. పలుచోట్ల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పీడీ కల్యాణ్‌ చక్రవర్తి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నామని, డీఆర్డీఏ జిల్లా కేంద్ర కార్యాలయంలో కాల్‌ సెంటర్‌ పెట్టామన్నారు.

5,422 మందికి బాధ్యత 

పింఛన్లకు సంబంధించిన నగదును శనివారమే ఉద్యోగులకు అందజేశారు. పుర కమిషనర్లు, ఎంపీడీవోల పర్యవేక్షణలో సచివాలయాలు, గ్రామాల్లోని వివిధ సంస్థల ఉద్యోగులు అందించనున్నారు. ఒక్కొక్కరు 50 మందికి ఇచ్చేలా మొత్తం 5,422 మందికి బాధ్యత అప్పగించారు. ప్రక్రియలో పాత పింఛను పుస్తకాలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు. 


పింఛన్ల పెంపు చరిత్రాత్మకం.. ఉడాకాలనీ, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతుందని, మొదటి రోజే శతశాతం అందజేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. 

సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులతో.. విజయనగరం వ్యవసాయ విభాగం, న్యూస్‌టుడే: సచివాలయాల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కలిపి 5422 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లనున్నారని కలెక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ తెలిపారు. ఒక్కొక్కరూ 50 నుంచి 60 మందికి నగదు అందజేస్తారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు