logo

విమానాశ్రయ అభివృద్ధికి తొలి అడుగు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావడం అభినందనీయమని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు.

Published : 28 Jun 2024 05:44 IST

  ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మాధవి 

భోగాపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావడం అభినందనీయమని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. విమానాశ్రయం అవసరాల కోసం గురువారం మండలంలోని సవరవిల్లి విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో సుమారు రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్, లైన్‌వర్క్స్‌ను ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ ప్రాంతం ఓ నగరంగా మారుతుందని, విమానాశ్రయం వస్తే వివిధ కంపెనీలు రావడంతో పాటు, వాటికి అనుసంధానంగా ఉండే పరిశ్రమలు వస్తాయన్నారు. వీటి వల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. విద్యుత్తు శాఖ ఎస్‌ఈ ఎం.లక్ష్మణరావు మాట్లాడుతూ విమానాశ్రయానికి నేరుగా విద్యుత్తు సరఫరా చేసేందుకు రామచంద్రపేటలో రూ.50 కోట్ల వ్యయంతో మెగా విద్యుత్తు ఉపకేంద్రం నిర్మించాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా రూ.2.6 కోట్లతో పవర్‌ట్రాన్స్‌ఫార్మర్, రూ.2.4 కోట్లతో లైన్‌వర్క్స్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈఈ జి.సురేష్‌బాబు, డీఈఈ కె.సత్యపరిపూర్ణకుమార్, ఏఈ మస్తాన్‌వలి  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని