logo

జిల్లా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ

జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతానని కొత్త కలెక్టర్‌ అంబేడ్కర్‌ అన్నారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు.

Published : 26 Jun 2024 04:33 IST

నూతన కలెక్టర్‌ అంబేడ్కర్‌

బాధ్యతలు స్వీకరిస్తున్న అంబేడ్కర్‌

ఈనాడు, విజయనగరం: జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతానని కొత్త కలెక్టర్‌ అంబేడ్కర్‌ అన్నారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పథకాలు, కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా అమలు చేస్తానన్నారు. గతంలో తాను ఉమ్మడి జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. జిల్లా భౌగోళిక పరిస్థితులపై కొంత వరకు అవగాహన ఉందని వివరించారు. మధ్యాహ్నం కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఆయన్ను జేసీ కె.కార్తీక్, డీఆర్వో అనిత, ఆర్డీవో సూర్యకళ, వివిధ శాఖల అధికారులు, సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు అభినందించారు.

నేడు తొలి సమీక్ష సమావేశం... సీజనల్‌ వ్యాధుల వ్యాప్తిపై జిల్లా కలెక్టర్‌ అంబేడ్కర్‌ బుధవారం ఉదయం తన సమావేశ మందిరంలో తొలి సమీక్ష నిర్వహించనున్నారు. వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా శాఖల అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో ఆయన సమావేశం కానున్నారు. వ్యాధులు అరికట్టేందుకు అవసరమైన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని