logo

మంత్రికి నియోజకవర్గ సమస్యలపై వినతి

వైకాపా హయాంలో వెనుకబాటుకు గురైన నెల్లిమర్ల నియోజకవర్గంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఎమ్మెల్యే లోకం మాధవి విన్నవించారు.

Published : 26 Jun 2024 04:30 IST

మంత్రి రామానాయుడికి పుష్పగుచ్ఛం అందిస్తున్న ఎమ్మెల్యే లోకం మాధవి  

భోగాపురం, న్యూస్‌టుడే: వైకాపా హయాంలో వెనుకబాటుకు గురైన నెల్లిమర్ల నియోజకవర్గంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఎమ్మెల్యే లోకం మాధవి విన్నవించారు. మంగళవారం సచివాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. నియోజకవర్గం సమస్యలను ప్రస్తావిస్తూ.. తోటపల్లి, తారకరామతీర్థసాగర్‌ ప్రాజెక్టులు, చంపావతి, గోస్తనీ నదుల అనుసంధానం పనులను వైకాపా ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వివరించారు. నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్యలు తీరేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వీటిపై శాఖాపరంగా దృష్టి సారిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే మాధవి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని