logo

Vizianagaram: వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి

ప్రస్తుత వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సంబంధిత ప్రభుత్వ శాఖలు నిరంతరం అప్రమత్తంగా వుంటూ జిల్లాలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా అధికారులను ఆదేశించారు.

Updated : 26 Jun 2024 20:22 IST

విజయనగరం గ్రామీణం: ప్రస్తుత వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సంబంధిత ప్రభుత్వ శాఖలు నిరంతరం అప్రమత్తంగా వుంటూ జిల్లాలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా అధికారులను ఆదేశించారు. కాలానుగుణ వ్యాధుల నియంత్రణపై బుధవారం మంత్రి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్‌తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వర్షాకాలంలో జనావాసాల మధ్య నీటి నిల్వలు లేకుండా చూడటం, తాగునీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు చేపట్టడం, నీటి వనరులు క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేయడం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి చర్యలపై దృష్టి సారించి వ్యాధుల నియంత్రణకు సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలన్నారు.  
సమావేశంలో ఆర్.డి.ఓ.లు బి.శాంతి, ఎం.వి.సూర్యకళ, ఇన్‌ఛార్జి ఆర్.డి.ఓ.మురళీకృష్ణ, జి.జి.హెచ్. సూపరింటెండెంట్‌ డా.ఎస్.అప్పల నాయుడు, డి.సి.హెచ్.ఎస్. డా.గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని