logo

Vizianagaram: ఘనంగా మాజీ మంత్రి జన్మదిన వేడుకలు

విజయనగరంలో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Published : 26 Jun 2024 16:10 IST

విజయనగరం గ్రామీణం: విజయనగరంలో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తెదేపా నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా విజయనగరం నగర పాలక సంస్థ డివిజన్లు గ్రామాల్లో తెదేపా అభిమానులు రక్తదాన శిబిరాలు, పుస్తకాలు పంపిణీ, వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని