logo

గిరి ప్రదక్షిణ భక్తులకు.. సౌకర్యవంతంగా ఏర్పాట్లు

ఈ నెల 20వ తేదీన ప్రారంభమయ్యే సింహగిరి ప్రదక్షిణకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ ఆదేశించారు.

Published : 05 Jul 2024 03:26 IST

దేవస్థానం అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

న్యూస్‌టుడే, సింహాచలం: ఈ నెల 20వ తేదీన ప్రారంభమయ్యే సింహగిరి ప్రదక్షిణకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ, జేసీ మయూర్‌ అశోక్‌తో కలిసి సింహాచలం తొలిపావంచా వద్ద ఏర్పాట్లపై సమీక్షించారు. సింహాచలం దేవస్థానం ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు గిరిప్రదక్షిణ రూట్మ్యాప్‌పై కలెక్టర్‌కు వివరించారు. తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఆ ప్రదేశంలో ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. రోడ్డు మరమ్మతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు దీపాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, సముద్ర స్నానాలు చేసే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు వంటివి జీవీఎంసీ నిర్వహించాలని; భక్తులకు సాఫీగా దర్శనాలు కలిగేలా చూడాలని దేవస్థానం అధికారులకు సూచించారు. అనంతరం అడివివరం, సింహగిరి రెండో ఘాట్రోడ్డు, లుంబినీ పార్కు, సీతమ్మధార, తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్‌ వి.సన్యాసిరావు, ప్రధాన ఇంజినీరు రవి కృష్ణంరాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ నరేశ్‌కుమార్, డీడీహెచ్‌ దామోదర్, ఎస్‌ఈలు రవి, వినయ్‌కుమార్, రామ్మోహనరావు, వేణుగోపాల్, జెడ్సీలు శైలజవల్లి, విజయలక్ష్మీ, హేమావతి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని