logo

పాఠశాల ఆటోలు భద్రంసుమా!

ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని తీసుకువెళ్తున్న ఆటోలు కూడా వాహనచట్టం ప్రకారం నిబంధనలు పాటించాలి. అటువంటి ఆటోల వివరాలను సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు ముందుగా నమోదు చేసుకోవాలి.

Published : 05 Jul 2024 03:16 IST

పాఠశాల ఆటోను తనిఖీ చేస్తున్న రవాణాశాఖ అధికారి (పాతచిత్రం)

ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని తీసుకువెళ్తున్న ఆటోలు కూడా వాహనచట్టం ప్రకారం నిబంధనలు పాటించాలి. అటువంటి ఆటోల వివరాలను సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు ముందుగా నమోదు చేసుకోవాలి.  విద్యార్థుల భద్రత దృష్ట్యా ఆటోల్లో ప్రయాణించే విద్యార్థులు, డ్రైవర్‌ చిరునామాతో పాటు, పూర్తి వివరాలను యాజమాన్యాలు తప్పక కలిగి ఉండాలి.

మాధవధార, న్యూస్‌టుడే: నగరంలో మొత్తం 200లకు పైగా ప్రైవేటు పాఠశాలలకు వివిధ ప్రాంతాల నుంచి 4వేల ఆటోల్లో దాదాపుగా 15 వేల మంది విద్యార్థులు ప్రతి రోజు ప్రయాణిస్తున్నట్లుగా రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇటువంటి ఆటోలు చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లుగా రవాణా, పోలీస్‌ శాఖ అధికారులు గుర్తించారు.  

పాఠశాల ఆటోకు ఉండవలసిన నిబంధనలు ఇవీ..

  • రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆటోలకు ముందు, వెనుక ‘పాఠశాల ఆటో’ అని బోర్డు రాయాలి.
  • పన్నెండేళ్ల లోపు పిల్లలైతే ఆరుగురిని, ఎనిమిది నుంచి పదేళ్లలోపు పిల్లలైతే ఎనిమిది మందికి మించి తీసుకువెళ్లకూడదు. ఒకవేళ ఆటో తక్కువకు వస్తోందని ఎక్కువ మందిని తీసుకెళ్తామంటే తల్లిదండ్రులు ప్రోత్సహించకూడదు.
  • ఆటోకు రెండు వైపులా పిల్లలు చేతులు బయటకు పెట్టకుండా గ్రిల్స్‌ను ఏర్పాటు చేయాలి.
  • ఆటోలకు ఇష్టానుసారంగా పిల్లల బ్యాగులు వేలాడదీయకూడదు.
  • ఆటో ఫిట్‌నెస్‌ కలిగి ఉండి, పన్నులు సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి.
  • ఆటోకు పోలీస్‌ శాఖ కేటాయించిన నంబర్‌ తప్పనిసరి.
  • ఆటో డ్రైవర్‌ లైసెన్స్, బ్యాడ్జీ కలిగి ఉండాలి. యూనిఫాం ధరించాలి.
  • కనీసం మూడేళ్ల నుంచి ఆటో నడుపుతూ ఉండాలి.
  • ఏ ఏ పాఠశాలలకు ఏ మార్గంలో పిల్లలను తీసుకుని వెళ్తున్నారనే విషయాల్ని ఆటోలోని బోర్డులో ప్రదర్శించాలి.
  • ఏ కారణం చేతనైనా ఒక వేళ డ్రైవర్‌ రాకపోతే మరో డ్రైవర్‌ను పంపించినప్పుడు, అతని వ్యక్తిగత వివరాలను తల్లిదండ్రులకు, యాజమాన్యానికి తెలియజేయాలి.
  • డ్రైవర్‌ ఫోన్‌ నెంబర్, లైసెన్సు నెంబర్, వ్యక్తిగత వివరాలు ఆటోలో ఉండేటట్లుగా బోర్డును ఏర్పాటు చేయాలి.

తల్లిదండ్రులు, యాజమాన్యాలు ఇలా చేయండి

  • ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న పాఠశాలలకు మాత్రమే ఆటోలో పిల్లలను పంపించాలి.
  • పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు కలిసి తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.
  •  డ్రైవర్‌ చిరునామా, కుటుంబ నేపథ్యం, గతంలో ప్రమాదాలు చేసిన సంఘటనలు ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలి.
  •  పాఠశాల యాజమాన్యం నెలకోసారి ఆటో డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేయాలి. నిబంధనలపై అవగాహన కల్పించేలా రవాణా, పోలీస్‌ శాఖలకు వారి వివరాలను తెలియజేయాలి.

పాఠశాల ఆటోలపై కేసుల నమోదు

నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న పాఠశాల ఆటోలపై నిరంతరం నిఘాను ఏర్పాటు చేసి కేసులు నమోదు చేస్తున్నాం. గత ఏడాది నుంచి పిల్లలను తీసుకువెళ్తున్న ఆటోలకు సంబంధించిన పూర్తి వివరాలను పాఠశాలల యాజమాన్యం తప్పసరిగా నమోదు చేయాలని ఉత్తర్వులు ఇచ్చాం. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, కమిటీని ఏర్పాటు చేసుకుని ఆటోలను నియమించుకోవాలని సూచించాం. ఈ మేరకు ప్రతి పాఠశాలకు నోటీసులు కూడా జారీ చేశాం. గత వారం రోజుల నుంచి ఆటోలపై 25 కేసులు నమోదు చేసి, ఒక ఆటోను సీజ్‌ చేశాం.

జి.సి.రాజారత్నం, డీటీఓ, విశాఖ జిల్లా.


పాఠశాల ఆటోలపై ప్రతి ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండే ఆటోలపై కేసులు నమోదు చేస్తారు. గత రెండేళ్లలో కేసుల నమోదు ఇలా...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని