logo

ఈనెల పంచదార లేనట్టే..!

జులై నెల కోటా కింద రేషను కార్డుదారులకు పంచదార అందే పరిస్థితి లేదు. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లాలోని పౌరసరఫరాల సంస్థ గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Published : 04 Jul 2024 02:14 IST

తూకాల్లో అక్రమాల నేపథ్యంలో నిలిపివేత

వన్‌టౌన్, న్యూస్‌టుడే: జులై నెల కోటా కింద రేషను కార్డుదారులకు పంచదార అందే పరిస్థితి లేదు. ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లాలోని పౌరసరఫరాల సంస్థ గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచదార, కందిపప్పు, ఇతర సరకులను తూకం వేసి చూడగా భారీ వ్యత్యాసం కనిపించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేపట్టగా అంతటా తూకాలు సరిగా లేనట్టు తేలింది. ఫలితంగా సంబంధిత గుత్తేదారుని నిలిపివేశారు. గోదాములకు సరకు రాకపోవడంతో జులై నెల వరకు పంపిణీ చేయలేకపోతున్నారు. 

జిల్లాలో 5.20లక్షల కార్డుదారులు ఉండగా, వారెవరికీ ఈనెల పంచదార అందే పరిస్థితి లేదు. వచ్చే నెలకు సంబంధించి కొత్త గుత్తేదారు వస్తే ఇస్తారు. ఈనెల మాత్రం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. గోధుమపిండి కిలో రూ.16 చొప్పున రెండు కిలోల వరకు ఇవ్వనున్నారు. ఈ మేరకు డిపోలకు సరకును సరఫరా చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని