logo

సింహగిరిపై వైభవంగా వరద పాయస ఉత్సవం

దేశంలో పంటలు బాగా పండేందుకు, అంతా సుభిక్షంగా ఉండేందుకు.. వర్షాలు సమృద్ధిగా కురిపించాలని వైకుంఠ నారాయణనుడిని భక్తులు వేడుకున్నారు.

Published : 04 Jul 2024 01:58 IST

సింహాచలం, న్యూస్‌టుడే: దేశంలో పంటలు బాగా పండేందుకు, అంతా సుభిక్షంగా ఉండేందుకు.. వర్షాలు సమృద్ధిగా కురిపించాలని వైకుంఠ నారాయణనుడిని భక్తులు వేడుకున్నారు. ఆర్ద్ర కార్తె ప్రవేశాన్ని పురస్కరించుకుని సింహగిరిపై అప్పన్న ఆలయ సమీప వైకుంఠ వాసుల మెట్టపై బుధవారం వరద పాయస ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు నేతృత్వంలో అర్చకులు మెట్టపై కొలువైన దేవేరుల సమేతుడైన వైకుంఠవాసుడి సన్నిధిలో విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం పూజలు జరిపారు.  ః అర్చకులు లక్ష్మీనారాయణులకు పంచామృతాలు, ఫలోదకాలతో ద్వాదశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. నూతన వస్త్రాలు, పూలమాలలతో దేవతామూర్తులను అలంకరించి మెట్టపైనే వండిన ప్రత్యేక పాయసాన్ని నివేదించారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణ, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ అర్చకులు మెట్టపై ఉన్న పొర్లుబండ పైనుంచి ఇత్తడి గంగాళంలోని పాయసాన్ని ఒలకబోశారు. బండపై పారుతున్న పాయసాన్ని భక్తులు ప్రసాదంగా స్వీకరించారు. ఈ ఉత్సవంలో దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి, దంపతులు, ఈఈలు శ్రీనివాసరాజు, బి.రాంబాబు, ఏఈవోలు ఎన్‌.ఆనంద్‌కుమార్, పాలూరి నరసింగరావు, మాజీ ట్రస్టీ గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని