logo

పలు రైళ్ల రద్దు..

వాల్తేరు డివిజన్‌ పలాస-విజయనగరం డివిజన్‌లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

Published : 04 Jul 2024 01:57 IST

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: వాల్తేరు డివిజన్‌ పలాస-విజయనగరం డివిజన్‌లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. ఈనెల 5న పలాస-విశాఖ (07471), విశాఖ-పలాస (07470), విశాఖ-గుణుపూర్‌ (08522), గుణుపూర్‌-విశాఖ (08521), విశాఖ-భవానీపట్న (08504), విశాఖ-బ్రహ్మపుర (08532) పాసింజర్‌ రైళ్లు, విశాఖ-భువనేశ్వర్‌ (22820) ఇంటర్‌సిటీ రైలును రద్దు చేసినట్లు ప్రకటించారు. అదే విధంగా ఈనెల 6న భవానీపట్న-విశాఖ (08503), బ్రహ్మపుర-విశాఖ (08531) పాసింజర్‌ రైళ్లు, భువనేశ్వర్‌-విశాఖ(22819) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని