logo

సింహగిరిపై వరద పాయసం ఉత్సవం రేపు

వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలన్న సంకల్పంతో సింహగిరి వైకుంఠవాసుల మెట్టపై బుధవారం వరద పాయసం ఉత్సవం నిర్వహించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు.

Published : 02 Jul 2024 02:48 IST

సింహాచలం, న్యూస్‌టుడే: వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలన్న సంకల్పంతో సింహగిరి వైకుంఠవాసుల మెట్టపై బుధవారం వరద పాయసం ఉత్సవం నిర్వహించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో వైకుంఠవాసుల మెట్టపై కొలువైన లక్ష్మీనారాయణుల సన్నిధిలో ఈ వేడుక నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఆ క్రమంలో బుధవారం ఉదయం 8గంటల నుంచి ఈ ఉత్సవం నిర్వహించాలని వైదికులు నిర్ణయించినట్లు ఈవో పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వామి సన్నిధిలో విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, లక్ష్మీనారాయణులకు పంచకలశ పూర్వక అభిషేకం, విరాట పర్వం పారాయణం, వరుణ మంత్ర జపం, పాయసం నివేదన జరుగుతాయని వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని