logo

కేజీహెచ్‌లో ముగ్గురు సెక్యూరిటీ సూపర్‌వైజర్లకు స్థానచలనం

కేజీహెచ్‌ భద్రతా విభాగంలో సూపర్‌వైజర్లుగా పనిచేస్తున్న శ్రీనివాస్, రామకృష్ణ, శ్రీకాంత్‌లను నగరంలోని ఈఎన్టీ, ఆర్‌ఈహెచ్, ఘోషాస్పత్రులకు బదిలీ చేశారు.

Published : 02 Jul 2024 02:47 IST

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేజీహెచ్‌ భద్రతా విభాగంలో సూపర్‌వైజర్లుగా పనిచేస్తున్న శ్రీనివాస్, రామకృష్ణ, శ్రీకాంత్‌లను నగరంలోని ఈఎన్టీ, ఆర్‌ఈహెచ్, ఘోషాస్పత్రులకు బదిలీ చేశారు. ఇటీవల కాలంలో భద్రతా విభాగ సూపర్‌వైజర్లపై పలు ఆరోపణలు వచ్చాయి. ఒకరిపై పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. కొంతమంది సూపర్‌వైజర్లు పూర్వపు ఏఆర్‌ఎంఓతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఆయా ఫిర్యాదులపై డీఎంఈ సైతం విచారణ జరిపించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు సూపర్‌వైజర్లను మార్చాలని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ శివానంద భద్రతా సంస్థకు సూచించారు. దీంతో ఇక్కడ ఉన్న ముగ్గురిని ఇతర ఆసుపత్రులకు పంపి, వారి స్థానంలో ఇతరులను నియమించారు. బీ ఎవరో ఒకరు తప్పుచేస్తే మిగిలిన వారిని బదిలీ చేయడం సరికాదని పలువురు భద్రతా సిబ్బంది సోమవారం నిరసన తెలిపి ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారిని కలిశారు. సూపర్‌వైజర్ల బదిలీతో తనకు సంబంధం లేదని, కేజీహెచ్‌లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది. దీంతో వారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ను కలిశారు. ప్రస్తుతం భద్రతా విధులు చేపట్టిన సంస్థ కాలపరిమితి మరో రెండు నెలల్లో ముగియనున్నది. తర్వాత టెండర్లు పిలిచి కొత్త గుత్తేదారుడిని ఎంపిక చేయాలని ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని