logo

ఆర్టీసీకి కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్లు

ఆర్టీసీకి కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్లులాంటి వారని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖమంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు.

Published : 02 Jul 2024 02:40 IST

త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
రవాణా మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి 

మద్దిలపాలెం, న్యూస్‌టుడే : ఆర్టీసీకి కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్లులాంటి వారని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖమంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. సోమవారం మద్దిలపాలెం సిటీడిపోలో ఆయన మూడు సూపర్‌ లగ్జరీ బస్సులను జెండాఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీలో సంస్కరణలు తీసుకువచ్చి లాభాల బాటలో నడిపిస్తామన్నారు. త్వరలో మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అందరి సహకారంతో ప్రమాదాలు సున్నాస్థాయికి తెస్తామన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆర్టీసీ స్థలాల్లో కార్గొ, కాంప్లెక్సులు వంటివి ఏర్పాటు చేస్తామని, కార్మికులకు భద్రత కల్పిస్తామన్నారు. అనంతరం గ్యారేజీ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఉత్తమ సిబ్బందికి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ అప్పలరాజు, అధికారులు కణితి వెంకటరావు, అప్పలనాయుడు, డిపో మేనేజర్లు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని