logo

1న జీతాలివ్వడం ఇదే తొలిసారి

అంగన్‌వాడీ ఉద్యోగులకు ఒకటో తేదీన కూటమి ప్రభుత్వం వేతనాలు జమ చేయడం అభినందనీయమని అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మజ్జి నాగశేషు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 02 Jul 2024 02:35 IST

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: అంగన్‌వాడీ ఉద్యోగులకు ఒకటో తేదీన కూటమి ప్రభుత్వం వేతనాలు జమ చేయడం అభినందనీయమని అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మజ్జి నాగశేషు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు స్థాపించిన దగ్గరి నుంచి ఒకటో తేదీన జీతాలు వేయడం ఇదే తొలిసారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లకు తాము రుణపడి ఉంటామన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధానం కొనసాగించాలన్నారు. వేతనాలు పెంపు, గ్రాట్యుటీ అమలు, మినీ, మెయిన్‌ వర్కర్స్‌గా గుర్తింపు తదితర డిమాండ్లు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని